పులివెందుల, సెప్టెంబర్ 30: పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవోస్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైనట్లు అధ్యక్షుడు గజ్జల జగన్నాథరెడ్డి, ట్రెజరర్ రామ గంగాధర్‌రెడ్డి యాదవ్ తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో తాలూకా పరిధిలోని ఉద్యోగులంతా సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు.
సభ్యత్వ రుసుమును ఒక్కొక్కరికి రూ.300గా నిర్ణయించినట్లు తెలిపారు. సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరూ రసీదు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఉద్యోగులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Was this article useful?



