Breaking

ఎల్‌నినో ప్రభావం.. పశువులపై ప్రత్యేక శ్రద్ధ

రాజుపాలెం: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి పశువులను కాపాడేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు అసోసియేట్ డీన్ డా. జి.ఆర్.కె. శర్మ సూచించారు. పశువుల ఆరోగ్యం, పశుగ్రాసం, నీటి నిర్వహణ, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు అవగాహన కల్పించేందుకు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో DRDA, రాజుపాలెం సహకారంతో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 38 మంది రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. శర్మ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పశువుల్లో వేడి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీంతో మేత తీసుకోవడం తగ్గి పాల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు తగినంత నీడ, గాలి ప్రసరణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పశుగ్రాసానికి కొరత లేకుండా ఎండుగడ్డి, సైలేజ్ తదితర మేతను ముందుగానే నిల్వ చేసుకోవాలని తెలిపారు. సమతుల్య పోషకాహారం అందించడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. వేడి ఒత్తిడి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు.

DRDA రాజుపాలెం APM సుజాత మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పశుపోషణ పద్ధతులను పాటిస్తూ అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. డా. డి. ఇందిర ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస నిర్వహణ, నీటి సంరక్షణ, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు వివరించారు.

డా. చరిత, డా. గాయత్రి, డా. మంజుల, డా. జాన్, డా. వంశీ, డా. మాధవరెడ్డి, రాజేష్ తదితరులు పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, పోషకాహారం, శాస్త్రీయ పశుపోషణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు నీరు, పశుగ్రాసం, పశువుల ఆరోగ్య నిర్వహణపై రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.