మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌నినో ఈ ఏడాది చివర్లో అత్యంత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్-డిసెంబర్ మధ్య ఇది గరిష్ఠ స్థాయికి చేరవచ్చని తాజా అంచనాలు సూచిస్తున్నాయి.
ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువులు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదలు, వేడిగాలులు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం 2027 వరకు కొనసాగితే వాతావరణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Was this article useful?



