లక్కిరెడ్డిపల్లి: ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో కర్ణాటకకు ఎర్రచందనం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన ఆరు ఎర్రచందనం దుంగలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో నలుగురు అన్నమయ్య జిల్లా, ఒకరు చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Was this article useful?



