కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైఎస్సార్సీపీ మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో డీఎస్సీ అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని మహమ్మద్ ఖాన్ హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.



