చక్రాయపేట: మండలంలోని సిద్ధారెడ్డిపల్లి గ్రామంలో చక్రాయపేట ఎస్సై చంద్రశేఖర్ గ్రామస్థులతో సమావేశమై రాబోయే ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఎన్నికల్లో చేయాల్సినవి, చేయకూడనివి గురించి వివరించారు.
అలాగే గ్రామంలోని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్సై, సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్సై చంద్రశేఖర్ కోరారు.
Was this article useful?



