Breaking

ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో పేదలకు ఆర్థిక భరోసా

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 1:
పట్టణంలోని 13వ వార్డులో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వీఎస్ ముక్తియార్ లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముక్తియార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హులకు ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఇతరులపై ఆధారపడకుండా తమ అవసరాలను తామే తీర్చుకునేందుకు ఈ పింఛన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.