కడప: ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు చేసే మోసాలకు నిరుద్యోగ యువత బలికావద్దని జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎ. సురేష్కుమార్ సూచించారు. ప్రభుత్వ శాఖల నుంచి అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లు, ప్రభుత్వ ప్రకటనల ద్వారానే తెలుసుకోవాలని సూచించారు.
Was this article useful?



