ప్రొద్దుటూరు: మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ ఆవరణలో హారిక హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్, డా. వీఎస్ ముక్తియార్, వైద్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



