పులివెందుల, ఆగస్టు 9: పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి గ్రామంలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, యువత, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. యువత పండుగ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించారు. దీంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
Was this article useful?



