Breaking

ఈడీ సోదాలతో కడపలో రాజకీయ కలకలం

కడప: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయనకు సన్నిహితుడిగా పేర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బలగాల భద్రత మధ్య పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే సోదాలకు గల కారణాలు, ఏ కేసుకు సంబంధించి ఈ తనిఖీలు చేపట్టారనే వివరాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈడీ సోదాల నేపథ్యంలో కడప జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.