డిసెంబర్ 23, 24 తేదీలలో అన్నమయ్య జిల్లా అంగళ్లు వేదికగా నిర్వహించనున్న ఇస్తిమా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కడప, అనంతపురం, అన్నమయ్య జిల్లాలకు చెందిన మత గురువులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మత గురువులు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మంత్రి మత గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక, సామాజిక ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఇస్తిమా కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



