అరకు వ్యాలీ యన్ టి ఆర్ పార్క్ నుంచి డుంబ్రిగుడ, కించుమండ,హుకుంపేట మీదుగా పాడేరు అంబేద్కర్ సెంటర్ వరకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కిల్లో రఘునాథ్,వి.మహేష్ లు మాట్లాడుతూ..ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలన్నారు.పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలు విడుదల చేయాలని ప్రకటించాలని,పిఆర్సి కమిషన్ చైర్మన్ నియమించాలని కోరారు.సహాధ్యక్షులు చీకటి నాగేశ్వరరావు మాట్లాడుతూ చుట్టుపక్కల రాష్ట్రాలను చూసి అయినా నేర్చుకొని కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని, భారీగా పేరుకుపోయిన ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కార్యవర్గ సభ్యులు పుడిగి దేముడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. జిల్లా కార్యదర్శి యస్ కన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం డిఏలు అయ్యార్ ఇవ్వాలన్న విషయమే మర్చిపోయిందని అన్నారు. జిల్లా కార్యదర్శి మాసాఢ శ్రీను మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లపై తక్షణమే స్పందించాలని కోరారు.
అనంతగిరి , అరకు, డుంబ్రిగుడ, పాడేరు, పెదబయలు, జి.మాడుగుల మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



