కడప జిల్లా: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వంపై సుండుపల్లి, పులివెందుల ఎంపీడీవోలపై పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఐవీఆర్ఎస్ నివేదికలను పరిశీలించిన ఆయన.. సుండుపల్లి ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, పులివెందుల ఎంపీడీవో శ్రీనివాసులరెడ్డి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరికీ తాఖీదులు జారీ చేసి, వారి వివరణలు పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం సస్పెన్షన్ చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ సీఈవో సుబ్రహ్మణ్యంను ఆదేశించారు.
Was this article useful?



