పులివెందుల: ఇంటి పెరట్లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పులివెందుల మండలంలో కలకలం రేపింది. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన చింత శేఖర్ (62), చింత రమణ (44)లు తమ ఇంటి పెరట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదు గంజాయి మొక్కలతో పాటు సుమారు 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితులను ఆగస్టు 17న పులివెందుల మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి వద్ద అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Was this article useful?



