ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం 9వ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 33వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



