జమ్మలమడుగు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం పెద్దముడియం మండలంలోని మేడిదిన్నె, బోడి తిప్పనపాడు గ్రామాల్లో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Was this article useful?



