పులివెందుల: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన జంతుశాస్త్ర విద్యార్థినులు ఆహార సాంకేతిక కళాశాలను సందర్శించారు. అధ్యాపకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్షేత్ర సందర్శనలో ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ మైక్రోబయాలజీ విభాగాల ప్రయోగశాలలను విద్యార్థినులు పరిశీలించారు. సోలార్ కోల్డ్ రూమ్, లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్ పనితీరును తెలుసుకున్నారు. ఆయా విభాగాల అధ్యాపకులు విద్యార్థినులకు పలు అంశాలను వివరించారు. ప్రత్యక్షంగా ప్రయోగశాలలను పరిశీలించడం ద్వారా ఆచరణాత్మక జ్ఞానం లభించిందని విద్యార్థినులు తెలిపారు.
Was this article useful?



