ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 30: బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో గుర్తుతెలియని ఇద్దరి మృతదేహాలకు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి మృతదేహంతో పాటు ఎర్రగుంట్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మార్చురీలో భద్రపరిచారు.
అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి, పోలీసు సిబ్బంది ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌ను సంప్రదించారు. స్పందించిన ఫౌండేషన్ సభ్యులు బుధవారం హిందూ స్మశానవాటికలో సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, అహమ్మద్ హుస్సేన్, అశోక్, సతీష్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆప్తులు లేని మృతులకు కూడా గౌరవప్రదమైన వీడ్కోలు అందించాలనే ఉద్దేశంతో తమ సేవలను కొనసాగిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు.



