Breaking

ఆదరణ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ప్రొద్దుటూరు: పట్టణంలోని సూపర్‌బజార్‌ రోడ్డులో గల అంగన్‌వాడీ కేంద్రంలో ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారుల సందడి, వేషధారణలతో అంగన్‌వాడీ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బైసాని సత్యనారాయణ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తన చిన్ననాటి మిత్రులు టంగుటూరు విజయభాస్కర్‌, బొగ్గరపు ప్రవీణ్‌ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చిన్నారుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు పండుగల విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
అంగన్‌వాడీ నిర్వాహకురాలు, ఆదరణ సంస్థ సభ్యురాలు కల్పన అందించిన సహకారంతో వేడుకలను విజయవంతంగా నిర్వహించినట్లు సత్యనారాయణ తెలిపారు. చిన్నారుల వేషధారణలను తల్లిదండ్రులు, సిబ్బంది ఆసక్తిగా తిలకించారు.
కార్యక్రమంలో ఆదరణ సంస్థ ఉపాధ్యక్షుడు అమరావతి శ్రీనివాసులు, సభ్యుడు రాంబాబు, అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.