Breaking

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని ప్రాణాలు కాపాడిన చింతకొమ్మదిన్నె పోలీసులు

కడప, సెప్టెంబరు 23: రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని చింతకొమ్మదిన్నె పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. ఉటుకూరు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రాత్రి 11.30 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మునిరెడ్డి, కానిస్టేబుల్ రాజగోపాల్‌రెడ్డి, హోంగార్డు సుబ్బారాయుడు.. మూలవంక గ్రామానికి చెందిన మౌలా (20) అనే యువకుడు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అతడిని ట్రాక్‌ నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు.
అనంతరం యువకుడితో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పడంతో పాటు, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వారిని పిలిపించి యువకుడిని సురక్షితంగా అప్పగించారు. సమయస్ఫూర్తితో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.