ప్రొద్దుటూరు, ఆగస్టు 31: మహిళలు, బాలలపై నేరాల నివారణకు ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో SCNR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాధ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ శ్రీ విభూకృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ టీవీ కొండారెడ్డి విద్యార్థులకు మహిళలు, బాలికలపై వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. మహిళల రక్షణకు అందుబాటులో ఉన్న శక్తి టీమ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. చంద్ర ఓబుల్‌రెడ్డి, లెక్చరర్ వీవీఎన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



