బద్వేలు, సెప్టెంబర్ 3: బద్వేలు సబ్‌రిజిస్ట్రార్ విద్యాసాగర్రెడ్డిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు, పలు రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించి వరుసగా ఆరోపణలు వెల్లువెత్తడంతో జిల్లా అధికారులు విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రొద్దుటూరు పరిధిలో హైకోర్టు అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను 2021లో ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలోనూ విద్యాసాగర్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ వ్యవహారంపై ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐడీ ఫిర్యాదు మేరకు సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదైనట్లు సమాచారం. గతంలోనూ విద్యాసాగర్‌రెడ్డి ఏసీబీ కేసులో అరెస్టై జైలులో గడిపినట్లు తెలుస్తోంది.
తాజాగా బద్వేలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల వ్యవహారంపై కూడా పలు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. కొందరు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు విచారణ చేపట్టి సబ్‌రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
అయితే సబ్‌రిజిస్ట్రార్‌పై వచ్చిన ఆరోపణలు విచారణలో తేలాల్సి ఉంది. అధికారికంగా విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



