కడప: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలు సుమారు ఆరు గంటల పాటు కొనసాగి ముగిశాయి. ఎంపీకి చెందిన ఆస్తులు, పులివెందులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరించినట్లు సమాచారం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన రూ.40 కోట్ల హవాలా లావాదేవీలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎంపీ బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి నుంచి ఈ వ్యవహారంపై అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే ఇంటి నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు ఈడీ అధికారులు తీసుకెళ్లలేదని మనోహర్ రెడ్డి తెలిపారు.
Was this article useful?



