ప్రొద్దుటూరు, సెప్టెంబరు 7: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులైన వారు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సూచించారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, దివ్యాంగులు తదితర అర్హులు సంబంధిత ధ్రువపత్రాలతో వార్డు సచివాలయాలను సంప్రదించాలన్నారు. అర్హత ఉన్న ఒక్కరూ పింఛన్‌కు దూరం కాకుండా చూడాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
Was this article useful?



