పులివెందుల: పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరామ్ హెచ్చరించారు. సోమవారం నగరిగుట్ట, సీయోను ప్రాంతాల్లో పోలీసులు నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 20 వాహనాలను సీజ్ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సీఐ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
Was this article useful?



