Breaking

అరవిందాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం

ప్రొద్దుటూరు: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా స్థానిక అరవిందాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ శిబిరంలో ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్సతో పాటు మందులు అందిస్తున్నారు. ముఖ్యంగా బీపీ, మధుమేహం, క్యాన్సర్, రక్తహీనత, ఊబకాయం, క్షయవ్యాధి తదితర సమస్యలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గర్భిణులకు కూడా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
వైద్యాధికారి డాక్టర్ మానస మాట్లాడుతూ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందించడమే శిబిరం ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య పథకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
యునాని వైద్యాధికారి డాక్టర్ నిరంజన్ మాట్లాడుతూ ఆయుష్ వైద్య శిబిరాల ద్వారా వివిధ వ్యాధులకు చికిత్సలు, మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పట్టణ బీజేపీ అధ్యక్షుడు నరేంద్రరావు కోరారు. కార్యక్రమంలో ఉప ఆరోగ్య విద్యాధికారి వెంకటేశ్వర్లు, సీవో సుబ్బారెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.