ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్‌ను వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నల్ల పోతుల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు.
ప్రొద్దుటూరును పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నాగరాజు కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కార్యాచరణకు ప్రాధాన్యత ఇస్తామని, పట్టణ అభివృద్ధిలో ప్రజల సహకారం కూడా కీలకమని కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. అనంతరం నాగరాజు కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన విజయవంతమైన పదవీకాలాన్ని ఆకాంక్షించారు.



