అన్నా క్యాంటీన్లో భోజనం రుచి పరిశీలించిన మల్లెల లింగారెడ్డి
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సందర్శన
ప్రొద్దుటూరు: ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మంగళవారం జమ్మలమడుగు రోడ్డులోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించారు. అక్కడ భోజనం చేస్తున్న పేద ప్రజలను కలిసి భోజనం నాణ్యత, రుచి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచికరంగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మల్లెల లింగారెడ్డి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామిశెట్టి బాబు, రామసంజీవరెడ్డి, శామీర్ భాషా, టప్పా మహబూబ్ భాషా, ఎన్టీఆర్ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.



