పులివెందుల: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారి వాజ్పేయి వర్ధంతి సందర్భంగా పులివెందుల బీజేపీ నాయకులు వాజ్పేయి సర్కిల్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వై. నవీన్ మాట్లాడుతూ దేశాభివృద్ధి, సుపరిపాలన, దేశభక్తి కోసం వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయలక్ష్మి, కే. తిరుపాల్ రెడ్డి, శంకరప్ప, లక్ష్మయ్య, వాజ్పేయి నాయుడు, యుగంధర్, తొండూరు నరేంద్ర రెడ్డి, వినయ్, డి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



