ప్రొద్దుటూరు: పట్టణంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సాయంత్రం స్వామి, అమ్మవార్ల మిరవణి కార్యక్రమాన్ని ఆలయ అధికారులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
భక్తులు స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కే.వి.రమణ, ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Was this article useful?



