ప్రొద్దుటూరు: శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ప్రత్యేక యాగశాల నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఆలయ ముఖ మండపం వద్ద హోమాల నిర్వహణతో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఆగ్నేయ దిశలో యాగశాలను నిర్మించనున్నారు.
ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, ఈవో కె.వి.రమణ, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. సోమవారం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక సేవలు నిర్వహించగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు
Was this article useful?



