Breaking

అగస్త్యేశ్వరుడి సేవలో భక్తుల సందడి

ప్రొద్దుటూరు: సోమవారం సందర్భంగా ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి, అమ్మవార్ల మిరవరి కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మిరవరి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. స్వామి, అమ్మవార్ల అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కే.వి. రమణ, ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.