పులివెందుల: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పులివెందుల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్-1, 2 ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు అక్షరాస్యత ప్రాధాన్యతపై ప్రతిజ్ఞ చేశారు.
నిరక్షరాస్యత నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని, పిల్లలు, పెద్దలు విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. విద్య ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడుతూ ‘అందరికీ విద్య–అందరికీ జ్ఞానం’ లక్ష్య సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ యు. శ్రీనిత, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



