Breaking

అక్రమ పార్కింగ్‌పై కమిషనర్ కొరడా

ప్రొద్దుటూరు: పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించేలా అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపే వారిపై మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ హెచ్చరించారు.
పురపాలక సంఘం ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌కు అడ్డంకిగా నిలిపిన ద్విచక్ర వాహనాలను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా నిలిపిన వాహనాల టైర్లలో గాలి తీయించి, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వాహనదారులను హెచ్చరించారు. అక్రమ పార్కింగ్‌ కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో పాటు పాదచారులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వ్యాపారులు, వాహనదారులు నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలను వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా వాహనాలను నిలిపితే ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. పట్టణంలో అక్రమ పార్కింగ్‌పై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించి ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.