అన్నమయ్య జిల్లా కలకడ మండలం, కోన గ్రామపంచాయతీ పరిధిలో తిప్పిగారిపల్లి–గంగిరెడ్డిగారిపల్లి గ్రామాల మధ్య కొండ ప్రాంతంలో అక్రమంగా సారాయి తరలిస్తున్న షేక్ సుహేల్ను కలకడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 లీటర్ల సారాయి, కేటీఎం మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వాయల్పాడు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అక్రమ సారాయి తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Was this article useful?



