పులివెందుల: మండలంలోని ఈ.కొత్తపల్లి గ్రామంలో అంత్రం, మంత్రం పేరుతో ఓ వ్యక్తిని నమ్మించి మత్తుమందు ఇచ్చి సుమారు రూ.80 వేల విలువైన బంగారు ఉంగరాన్ని చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆలీపు వద్దకు వచ్చిన ఓ ఫకీరు అంత్రం వేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మించినట్లు తెలుస్తోంది. అనంతరం మత్తుమందు ఇచ్చి ఉంగరాన్ని తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉంగరం కనిపించకపోవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఫకీరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Was this article useful?



