పులివెందుల పట్టణంలోని బ్రాహ్మణపల్లి రోడ్డులో ఉన్న శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానంలో ఆషాఢ మాసం నాలుగవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూలు, తులసి మాలలతో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాహుకాల పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Was this article useful?



