తొండూరు మండల పరిధిలోని తొండూరు సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ, 6వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. ఉషారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రిన్సిపాల్ వివరాల ప్రకారం, 5వ తరగతిలో ఓసీ విభాగంలో 1 సీటు, ఎస్టీ విభాగంలో 2 సీట్లు, ఎస్సీ విభాగంలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే 6వ తరగతిలో ఎస్సీ విభాగంలో 6 సీట్లు, ఎస్టీ విభాగంలో ఒక సీటు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి ఉన్న వారు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9704550129 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ వి. ఉషారాణి తెలిపారు.



