రోటరీ క్లబ్ రాయచోటి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం నీలకంఠరావుపేటలోని శ్రీ సద్గురు దర్గా స్వామీజీ ఆశ్రమం పరిధిలోని హైస్కూల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. దాత కొత్త సుదర్శన్ అందించిన నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ (ఏజీ) సుధీర్ రెడ్డి, పాస్ట్ ఏజీ పి. సురేష్ కుమార్, టీ. సత్యం, మనోజ్, క్లబ్ అధ్యక్షుడు మహేష్ రాజు, కార్యదర్శి రూపేష్, నరేంద్ర, నరసింహ, ప్రకాష్, ప్రసాద్, ఉపాధ్యాయులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Was this article useful?



