చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లిలో ఈ నెల 9న అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ వీరుపాక్షమ్మ తల్లి బోనాల విందు మహోత్సవం ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు మౌర్యా రెడ్డి, మంత్రి తనయుడు, యువనాయకుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గురువారం పరిశీలించారు.
మహోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోనాల విందు నిర్వహణ తదితర అంశాలపై స్థానిక నాయకులు, నిర్వాహకులతో కలిసి వారు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, నిర్వాహకులకు సూచించారు.
ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ వీరుపాక్షమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని వారు పిలుపునిచ్చారు.



