ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, 3 టౌన్ పోలీసులు సమాచారం అందించగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు స్పందించి హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, సతీష్, రసూల్ పాల్గొన్నారు. సమాజంలో అనాథలకు కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అలాగే శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయాలనుకునే దాతలు 82972 53484, 91822 44150 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Was this article useful?



