మోక్ష క్రియేషన్స్ అధినేత తల్లం నరేంద్రకుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక దివ్యాంగుల కుట్టు శిక్షణ కేంద్రానికి ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా వికలాంగుల నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షులు డా. ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం నరేంద్రను వికలాంగుల నెట్వర్క్ ప్రతినిధులు దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వికలాంగుల నెట్వర్క్ నాయకులు, మిత్రబృందం, టైలరింగ్ శిక్షణ కేంద్రం సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.
Was this article useful?



