బద్వేలు, ఆగస్టు 6 : జిల్లాలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు పొందిన 25 మంది కేజీబీవీ ఉపాధ్యాయులను పాత స్థానాల్లోనే కొనసాగించాలని యూటీఎఫ్ కడప జిల్లా శాఖ సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ బి. అనురాధకు వినతిపత్రం సమర్పించింది.
యూటీఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ, కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేసి ఉపాధ్యాయులకు మళ్లీ బదిలీలు చేయకుండా చూడాలని కోరారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు పంపడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పార్ట్‌టైమ్ పీజీటీలకు పెండింగ్‌లో ఉన్న ఏప్రిల్ నెల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Was this article useful?



