బద్వేలు, ఆగస్టు 6 : గోపవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతోందని ఆరోపిస్తూ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు గురువారం ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకొని, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




One Response
good