ప్రొద్దుటూరు, ఆగస్టు 6: రోటరీ క్లబ్ 2025–26 సంవత్సరంలో విశిష్ట సేవలు అందించి క్లబ్‌కు ఉత్తమ రోటరీ క్లబ్ అవార్డుతో పాటు మొత్తం ఏడు అవార్డులు సాధించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ అధ్యక్షుడు రొటేరియన్ పీహెచ్‌ఎఫ్ గజ్జల వెంకటేశ్వర రెడ్డిని రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి, కార్యదర్శి గండ్లూరు శ్రీధరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గజ్జల వెంకటేశ్వర రెడ్డి నాయకత్వంలో క్లబ్ చరిత్రలో ఎన్నో వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహించి రోటరీ ప్రతిష్టను మరింత పెంచారని కొనియాడారు. సన్మానానికి స్పందించిన గజ్జల వెంకటేశ్వర రెడ్డి, ఈ అవార్డులు రొటేరియన్స్ అందరి సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి డిస్ట్రిక్ట్-3160లో అత్యుత్తమ స్థానాన్ని సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు రొటేరియన్స్, రోటరాక్టర్స్ పాల్గొన్నారు.



