కడప కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన నిర్వహించిన ఎల్ నినో పరిస్థితులు – ప్రత్యామ్నాయ సన్నద్ధత చర్యలపై సమీక్ష సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితి, జలాశయాల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు, ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వివిధ శాఖలు చేపడుతున్న ప్రత్యామ్నాయ సన్నద్ధత చర్యలను సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిధి మీనా తదితర అధికారులు పాల్గొన్నారు.
Was this article useful?



