కడప, ఆగస్టు 6: వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా కారణాలతో 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు తాత్కాలిక అటాచ్మెంట్లు కల్పిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వుల ప్రకారం సింహాద్రిపురం ఎస్ఐ హెచ్. డాక్టర్ నాయక్‌ను వీఆర్, కడపకు, తొండూరు ఎస్ఐ బి. ఘనా మద్దులేటిని సింహాద్రిపురానికి, వల్లూరు ఎస్ఐ ఆర్. శివనాగిరెడ్డిని తొండూరుకు, బి.కొడూరు ఎస్ఐ జి. సూర్యనారాయణరెడ్డిని వల్లూరుకు, వేంపల్లి ఎస్ఐ డి. తయార్ హుస్సేన్‌ను బి.కొడూరుకు, కమలాపురం ఎస్ఐ ఎ. విద్యాసాగర్‌ను కొండాపురానికి, ప్రొద్దుటూరు-1 టౌన్ ఎస్ఐ ఎస్. శ్రీనివాసులను కమలాపురానికి, ప్రొద్దుటూరు-3 టౌన్ ఎస్ఐ పి. మొయినుద్దీన్‌ను ప్రొద్దుటూరు-1 టౌన్‌కు, కొండాపురం ఎస్ఐ యు.వై. జయరాములను బద్వేలు యూ/జీ పోలీస్‌స్టేషన్‌కు, బద్వేలు యూ/జీ ఎస్ఐ టి.వి.ఎన్. చిరంజీవిని బద్వేలు రూరల్‌కు, బద్వేలు రూరల్ ఎస్ఐ ఎం. రంగారావును బద్వేలు యూ/జీకి, బద్వేలు యూ/జీ ఎస్ఐ ఆర్.వి. కొండారెడ్డిని కడప-2 టౌన్ యూ/జీ పోలీస్‌స్టేషన్‌కు తాత్కాలికంగా అటాచ్ చేశారు.
సంబంధిత ఎస్డీపీఓలు వెంటనే ఆయా ఎస్ఐలను రిలీవ్ చేసి కొత్త విధి స్థానాల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. కొత్త విధి స్థానాల్లో బాధ్యతలు స్వీకరించిన తేదీలను జిల్లా పోలీసు కార్యాలయానికి తెలియజేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



