బద్వేలు, ఆగస్టు 5 : అట్లూరు మండలం కామసముద్రం గ్రామంలో నిర్వహించిన “గడప గడపకు కూటమి ప్రభుత్వం” కార్యక్రమంలో బద్వేలు టీడీపీ ఇన్చార్జ్, ఉమ్మడి కడప జిల్లా డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి సూర్యనారాయణ రెడ్డి ఆహ్వానం పలికారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, ప్రజాసేవే టీడీపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



