Breaking

అక్రిడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే రాయితీ ఇవ్వాలి: ఎంపీ అవినాష్ రెడ్డి

పులివెందుల, ఆగస్టు 5: అక్రిడిటెడ్ పాత్రికేయులకు భారతీయ రైల్వేల్లో గతంలో అమలులో ఉన్న ప్రయాణ రాయితీ సౌకర్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ వైఎస్సార్ కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. కోవిడ్ సమయంలో నిలిపివేసిన ఈ రాయితీ సాధారణ రైలు సేవలు పునరుద్ధరైనప్పటికీ ఇప్పటికీ అమల్లోకి రాలేదని ఆయన పేర్కొన్నారు. సమాజానికి సేవలందిస్తున్న గుర్తింపు పొందిన జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎంపీ చేసిన ఈ విజ్ఞప్తిని పలువురు పాత్రికేయులు స్వాగతించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.